తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్‌లోని (Toopran) ఓ కాలేజీలో డిగ్రీ పరీక్ష నిలిచిపోయింది. తమకు జీతాలు ఇవ్వడం లేదనే కారణంతో అధ్యాపకులు కాలేజీకి రాలేదు. దీంతో గురువారం ఉదయం జరగాల్సిన డిగ్రీ పరీక్ష ఆగిపోయింది. తూప్రాన్‌లోని నలంద డిగ్రీ కాలేజీలో గత కొన్ని రోజులుగా పరీక్షలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం కంప్యూటర్ సైన్స్ పరీక్ష రాసేందుకు నలుగురు విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సింది. 10.30 గంటలు అవుతున్నా కాలేజీ తాళాలు తెరచుకోలేదు. దీంతో విద్యార్థులు పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ విజయలక్ష్మి, పోలీసులు విద్యార్థులతో మాట్లాడారు.
కాగా, తమకు జీతాలు ఇవ్వడం లేదనే అధ్యాపకులు కాలేజీకి రాలేదని సమాచారం. దీంతో అధికారులు చొరవ తీసుకుని విద్యార్థులు పరీక్ష రాసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు. తెలిసింది. మధ్యాహ్నం 2 గంటలకు విద్యార్థులు మరో పరీక్ష రాయాల్సి ఉన్నది.