హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : నూతన విద్యాసంవత్సరం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక ఆదేశాలిచ్చింది. అన్ని వర్సిటీలు డిగ్రీ, పీజీ ఫస్టియర్ క్లాసులను ఆగస్టు మొదటివారం తర్వాతే నిర్వహించాలని సూచించింది. ఇందుకు వర్సిటీలు ముందుగానే అకడమిక్ క్యాలెండర్ను రూపొందించుకోవాలని, ప్రణాళికాబద్ధంగా విద్యాసంబంధ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. ఇది విద్యాప్రమాణాల పెంపునకు దోహదపడుతుందని యూజీసీ స్పష్టంచేసింది. ఈ మేరకు ‘మినిమం స్టాండర్డ్స్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఫర్ ది గ్రాంట్ ఆఫ్ ది ఫస్ట్ డిగ్రీ’ పేరిట మార్గదర్శకాలను జారీచేసింది.