నాంపల్లి కోర్టులు, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో రి మాండ్ ఖైదీలుగా ఉన్న అదనపు డీఎస్పీ లు భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో డిఫాల్ట్ (తప్పనిసరి) బెయిల్ పి టిషన్లను దాఖలు చేశారు. దీంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు నోటీసులు జారీ చేయా లని మేజిస్ట్రేట్ సూచించారు. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాది స్పంది స్తూ.. పీపీ కి నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని, శుక్రవారం నాటితో నిందితులిద్దరి కస్టడీ 90 రోజులు పూర్త యినందున డిఫాల్ట్‌గా బెయిల్‌ను మం జూరు చేసే అధికారం కోర్టుకు ఉన్నదని వివరించారు. దీంతో భుజంగరావు, తిరుపతన్న డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై పీపీకి నోటీసులు జారీ చేయాలని ఆదేశిం చిన జడ్జి.. విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.