Deeksha Divas | హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ఫూర్తితో ఈ నెల 29న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 33 జిల్లా కేంద్రాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో దీక్షా దివస్ చేపడుతామని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావుగౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, కేపీ వివేకానంద, పార్టీ నేత చల్మెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కేసీఆర్ చెరగని ముద్రవేశారని, మళ్లీ ఆనాటి ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ, నాడు తెలంగాణ సమాజా న్ని ఐక్యం చేసిన సందర్భాన్ని స్మరించుకుం టూ, ఆ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతామని తెలిపారు. ఈ దుర్మార్గ కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి బు ద్ధి చెప్పేందుకు కదం తొకుతామని చెప్పారు. 29న కార్యక్రమ విజయవంతానికి పార్టీ శ్రేణు లు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమాల నిర్వహణకు 33 జిల్లాలకు సీనియర్ నాయకులను ఇన్చార్జులుగా నియమించినట్టు వెల్లడించారు. ఈ నెల 26న అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు, 27, 28 తేదీల్లో ఏర్పాట్లకు కసరత్తు చేపట్టనున్నట్టు తెలిపారు. కేసీఆర్ తన దీక్షను ముగించిన డిసెంబర్ 9న మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిషరిస్తామని చెప్పారు. ఆ రోజున పార్టీ నాయకులంతా పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తూ తెలంగాణ తల్లికి ప్రణమిల్లాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ దీక్షతో ఉద్యమానికి నిమ్స్ ద వాఖాన కేంద్ర బిందువుగా మారిందని గుర్తుచేశారు. అందుకే డిసెంబర్ 9న నిమ్స్ దవాఖానలో అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ఆనాటి కార్యక్రమా లు, ఉద్యమ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు తెచ్చేలా మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ గులాబీ జెండాను ఎగురవేశారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలు పు తిప్పి, ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహా నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. ‘2009 నవంబర్ 29న కేసీఆర్ నాడు చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజ అని గుర్తు చేశారు. స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు గా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినమని తెలిపారు. ఆనాడు ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ తెచ్చుడో’ అని తెగువ చూపిన నాయకుడికి 3కోట్ల మంది తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో అండగా నిలబడ్డారని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్య వస్థను ఒప్పించి, మెప్పించి, కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ కలిపిన సందర్భం దీక్షా దివస్’ అని కేటీఆర్ గుర్తుచేశారు.
అసిఫాబాద్ : నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ
ఆదిలాబాద్ : వీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ
నిర్మల్ : శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ
మంచిర్యాల : తుల ఉమ, మాజీ జడ్పీ చైర్పర్సన్
నిజామాబాద్ : ఫరూక్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్సీ
కామారెడ్డి : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
మెదక్ : వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ
సంగారెడ్డి : భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
సిద్దిపేట : యాదవరెడ్డి, ఎమ్మెల్సీ
రంగారెడ్డి : మహమూద్ అలీ, ఎమ్మెల్సీ
వికారాబాద్ : నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ
మేడ్చల్ : స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్సీ
మహబూబ్‌నగర్ : క్యామ మల్లేశ్
నారాయణపేట : కోటిరెడ్డి, ఎమ్మెల్సీ
గద్వాల : కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ
వనపర్తి : ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్
నాగర్‌కర్నూల్ : విజయసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
నల్లగొండ : మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ
సూర్యాపేట : బండా నరేందర్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్
భువనగిరి : పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ
జనగామ : బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే
వరంగల్ : ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
హనుమకొండ : వాణీదేవి, ఎమ్మెల్సీ
ములుగు : డాక్టర్ సుధీర్‌కుమార్, మాజీ జడ్పీ చైర్మన్
మహబూబాబాద్ : కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే
భూపాలపల్లి : సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ
ఖమ్మం : తకెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీ
కొత్తగూడెం వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ
కరీంనగర్ : బండా ప్రకాశ్‌ముదిరాజ్, ఎమ్మెల్సీ
సిరిసిల్ల్ల : బీ వినోద్‌కుమార్, మాజీ ఎంపీ
పెద్దపల్లి : కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి
జగిత్యాల ; ఎండీ సలీం, మాజీ ఎమ్మెల్సీ
హైదరాబాద్ : పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి
తెలంగాణ సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో నే డు మళ్లీ రెండు జాతీయ పార్టీల మెడలు వంచాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపై ఉన్నదని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘అప్పుడున్న సమై క్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు ఛిద్రమైందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ ఇప్పుడవే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. అవే నిర్బంధాలు, అవే అణచివేతలు, అవే దు ర్భర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. అందుకే దీక్షా దివస్ నుంచి స్ఫూర్తి పొంది.. కాంగ్రెస్ కబంధహస్తాల నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ‘స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష’ అన్న ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో పోరాడుదామని చెప్పారు. ఈ రోజు ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని, ఆనాటి పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. దాని కోసం ప్రజలంతా కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన సందర్భం వచ్చింది’ అని కేటీఆర్ చెప్పారు.