యాదగిరిగుట్ట, మార్చి 5: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార సేవోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బుధవారం యాదగిరీశుడికి నిత్యపూజా కైంకర్యం జరిగిన అనంతరం స్వామిని మురళీకృష్ణుడిగా అలంకరించి తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. శ్రీకృష్ణావతార విశిష్టతను ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు వివరించారు.
డెడికేటెడ్ కమిషన్ నివేదికపై చర్యలేంటి? ;‘స్థానిక’ రిజర్వేషన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కల్పన కోసం ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ విచారణ ఏ దశలో ఉన్నదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ కమిషన్ విచారణ పూర్తయిందా? విచారణ పూర్తయి తే నివేదికను సమర్పించిందా? అని ప్రశ్నించింది. నివేదిక అందితే ఎలాంటి చర్యలు చేపట్టారో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్ప ష్టం చేసింది. స్థానిక సంస్థల రిజర్వేషన్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రతిని కూడా అందజేయాలని పేర్కొంటూ.. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.