హైదరాబాద్, అక్టోబర్26 (నమస్తే తెలంగాణ): అనుమతి లేకుండా బదిలీలు పొందిన ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్)లకు వచ్చే నెల జీతాల చెల్లింపుపై ఫైనాన్స్ డిపార్టుమెంట్ నిషేధం విధించడంపై ఇరిగేషన్‌శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇరిగేషన్‌శాఖ ఏఈఈలు డిమాండ్ చేస్తున్నారు. నీటిపారుదలశాఖలో పనిచేస్తున్న 500 ఏఈఈలకు ఇటీవల బదిలీలను నిర్వహించారు. బదిలీ పొందిన ఏఈఈలకు సంబంధించి వచ్చే నెల వేతనాల చెల్లింపును నిలిపివేయాలని డైరెక్టర్ వర్ అండ్ అకౌంట్స్ తాజాగా ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. జీవో 193 ప్రకారమే బదిలీ చేశారని, ఉద్దేశ్యపూర్వకంగా ఇంజినీర్లపై డైరెక్టర్ వర్స్ అండ్ అకౌంట్స్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఏఈఈలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.