హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్సీ) తెలిపింది. ఏఎన్ఎం, జీఎన్ఎం, ఈ ఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ, ఎమ్మెస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ డిప్లొమా, ఎన్పీసీసీ కోర్సుల్లో ప్రవేశాలకు మంగళవారం గడువు ముగిసింది. అనేక రాష్ర్టాల విజ్ఞప్తి మేరకు గడువు పెంచామని ఐఎన్సీ వెల్లడించింది.