హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ సప్లిమెంటరీ( Supplementary ) పరీక్షల ఫీజు ( Inter Exam Fees ) గడువును మరో రెండు రోజుల పాటు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఈనెల 2 నుంచి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించామని తెలిపారు. ఆలస్య రుసుం రూ.3వేలతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చని సూచించారు. రెగ్యులర్, ఫెయిలైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.