హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువును బోర్డు మరోసారి పొడిగించింది. రూ.500 ఆలస్య రుసుముతో రెండో విడత అడ్మిషన్ల గడువుకు 30 వరకు అవకాశమిచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం ఆలస్య రుసుము తీసుకోరు. కేవలం ప్రైవేట్ కాలేజీల్లో చేరేవారు మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో జనరల్ కోర్సుల్లో 60,525 మంది, వొకేషనల్ కోర్సుల్లో 21,957 మంది చొప్పున మొత్తంగా 82వేలకు పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఫస్టియర్లో అడ్మిషన్ల కోసం స్పాట్ షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. 25 నుంచి 27 వరకు అవకాశమిచ్చారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీల్లోని అన్ని సీట్లకు, ప్రైవేట్ ఎయిడ్ కాలేజీల్లోని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో సీట్లకు స్పాట్ అడ్మిషన్లకు అవకాశామిచ్చినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు.