దేశంలో 7 కోట్ల మందికి మధుమేహం.. ఆరోగ్యకరమైన జీవితమే ప్రధానం
దేశంలో 7 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారని తెలంగాణ రీసెర్చ్ సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ డీసీ తిరుపతిరావు తెలిపారు. ప్రీ డయాబెటీస్‌తో వారి సంఖ్య 14 కోట్లకు పెరిగే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
- తెలంగాణ రీసెర్చ్ సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా ఆర్గనైజింగ్ చైర్మన్ తిరుపతిరావు
- ‘ప్రతిమ’లో డయాబెటిస్ సదస్సు
కరీంనగర్ రూరల్, జూన్ 14 : దేశంలో 7 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారని తెలంగాణ రీసెర్చ్ సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ డీసీ తిరుపతిరావు తెలిపారు. ప్రీ డయాబెటీస్‌తో వారి సంఖ్య 14 కోట్లకు పెరిగే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం కరీంనగర్ మండ లం నగునూర్‌లోని ప్రతిమ వైద్య కళాశాల ఆడిటోరియంలో ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ, తెలంగాణ రీసెర్చ్ సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా సంయుక్తంగా ఏర్పాటు చేసిన సీఎంఈ కార్యక్రమం ‘పంచమ్-2026 డయాబెటీస్ వైద్య శాస్రీయ సదస్సు’ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సదస్సులో ఢిల్లీ, హెదరాబాద్తోపాటు వివిధ ప్రాంతాల నుంచి అనుభవజ్ఞులైన వైద్యులు హాజరై డయాబెటిస్‌పై శాస్త్రీయ నూతన విధానాలు, రీసెర్చ్ చేసి న వివరాలు, వచ్చిన సందేహాలను వివరించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ.. డయాబెటీస్‌పై ఆధునిక వైద్య ఆలోచనా విధానాన్ని పెంపొందించేందుకు రాష్ట్రం లో మొదటి నుంచి తమ సంస్థ ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వ్యాధిగ్రస్తుల జీవన శైలిలో మార్పులు రావాలని, శారీరక వ్యాయామం, నడక అలవాటు చేసుకోవాలని, జంక్‌ఫుడ్, బయట ఆహారం మానేయాలని, మాంసాహారాన్ని తగ్గించడం, రోజూ సరైన సమయంలో 8 గంటల నిద్ర తప్పక ఉండేలా అలవాటు చేసుకోవాలని సూచించారు.
నిరంతరం అవగాహన పెంచుకోవాలి
మధుమేహం దేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆధునిక వైద్య విధానాలు, తాజా పరిశోధనలపై వైద్యులు నిరంతరం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జీ దీప అన్నారు. మధుమేహం ప్రస్తుతం ప్రజారోగ్య సమస్యగా మారిందని, ఐసీఎంఆర్ అధ్యయనాల ప్రకారం దేశంలో డయాబెటీస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతిమ వైద్య కళాశాల ఎండీ బోయినపల్లి శ్రీనివాస్‌రావు ఇలాంటి సదస్సులను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. సదస్సులో ప్రతిమ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ పీఎల్ జాన్ ఇజ్రాయిల్, జిల్లా ఆర్గనైజింగ్ చైర్మన్ విజయమోహన్‌రెడ్డి, సీఎల్ ప్రసాద్, రాంచంద్రరావు, రఘురామారెడ్డి, కుమార్, విఠల్, శ్రీదేవి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

