KUDA | హెచ్సీయూ తరహాలో భద్రకాళి చెరువుపై కన్నేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి చెరువుని కబ్జా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపిం చారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కుడాలో (కాకతీయ డెవలప్మెంట్ అథారిటీ) రాజేందర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి అవినీతికి పాల్పడ్డారన్నారు.
తెలంగాణ రెండో రాజధాని అయిన వరంగల్లో గజం స్థలం రూ.1.50 లక్షలు ఉంటే జూన్ 21 నాడు నాయిని రాజేందర్ రెడ్డి కొందరితో సిండికేట్ అయి కుడా వేలంపాటలో రూ.60 వేలకే తీసుకున్నాడు.ప్రపంచమంతా ఆన్లైన్ టెండర్లు నడుస్తుండగా కుడాలో మాత్రం ఆఫ్లైన్ టెండర్లు వేస్తున్నారని మండిపడ్డారు. 2.27 ఎకరాల స్థలాన్ని కుడా కార్యాలయంలో నాలుగు గోడల మధ్య వాళ్లే నలుగురు కూర్చొని వేలంపాట పాడి సుమారు రూ.70 కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, KUDA చైర్మన్ వెంకట్రామిరెడ్డి కలిసి KUDAలో అన్ని అవినీతి పనులు చేశారు
తెలంగాణ రెండవ రాజధాని అయిన వరంగల్లో గజం స్థలం రూ.1.50 లక్షలు ఉంటే జూన్ 21 నాడు నాయిని రాజేందర్ రెడ్డి కొందరితో సిండికేట్ అయి KUDA వేలంపాటలో రూ.60 వేలకే తీసుకున్నాడు… https://t.co/KT1U14LCZy pic.twitter.com/LalqXd8dCs
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2026
HCU తరహాలో భద్రకాళి చెరువుపై కన్నేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, KUDA చైర్మన్
కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, KUDA చైర్మన్ వెంకట్రామిరెడ్డి కలిసి ఈ చెరువుని కబ్జా చేస్తున్నారు
ఇదేంటని పర్యావరణ వేత్తలు ప్రశ్నిస్తే ఎడిటెడ్ వీడియో అని నాయిని రాజేందర్ రెడ్డి అంటున్నాడు
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2026