Anganwadi Centers | హైదరాబాద్ : రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 8 రోజుల పాటు అంగన్వాడీ కేంద్రాలు మూసి ఉండనున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్న అంగన్వాడీ టీచర్లపై పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని 18,000లకు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని నాడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీకి అతీ లేదు, గతీ లేదు అని అంగన్వాడీలు మండిపడ్డారు.
Anganwadi123