
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 17 : దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకానికి ఆయా వర్గాల నుంచి విశేష స్పందన వస్తున్నది. దళిత ఉద్యోగులకూ పథకాన్ని వర్తింపజేస్తామని హుజూరాబాద్ సభలో సీఎం ప్రకటించడంపై మంగళవారం రా ష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. అన్నిజిల్లాల కలెక్టరేట్ల ఎదుట టీఎన్జీవో సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. పటాకులు కాల్చి, స్వీట్లు పం చుకొని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
దళితులు ఆత్మాభిమానంతో తలెత్తుకొని బతికేలా సీఎం కేసీఆర్ దళితబంధును ప్రవేశపెట్టారని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు రామినేని శ్రీనివాస్‌రావు, కస్తూరి వెం కటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, శ్రీరామ్, కొం డల్‌రెడ్డి పాల్గొన్నారు. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లాశాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం హుస్సేనీ ఆధ్వర్యంలో నాంపల్లిలో పటాకులు పేల్చి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం సీఎం నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ నాంపల్లి యూసుఫ్ బాబా దర్గాలో చాదర్‌ను సమర్పించారు. ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలోని అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక బోనాలు సమర్పించారు.
హన్మకొండ కలెక్టరేట్ ఎదుట టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రాజేందర్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కరీంనగర్ కలెక్టర్ ఆవరణలో టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పెద్దపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, టీఎన్జీవో జిల్లాశాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్, సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. టీఎన్జీవో జిల్లా అ ధ్యక్షుడు, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ బొంకూరి శంకర్,జిల్లా కార్యదర్శి రాజనరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ఆధ్వర్యం లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి గంగవరపు బాలకృష్ణ, కేంద్ర సంఘం కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, అంబేద్కర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. నల్లగొండ జిల్లావ్యాప్తంగా టీఎన్జీవో ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు శ్రవణ్కుమా ర్, కిరణ్‌కుమార్ నేతృత్వంలో ఉద్యోగులు సీఏం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.