బొడ్రాయిబజార్, జనవరి 23: సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోవాలని దళిత సంఘాల నాయకులు, ప్రజలు డిమాండ్ చేశారు. మాల మహానాడు, ఎమ్మార్పీఎస్, టీఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట పట్టణంలోని రైతుబజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 9వ వార్డు ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు హసేన్, టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాములు, ఎమ్మార్పీఎస్ నాయకుడు చిన్న శ్రీరాములు ఉన్నారు.