ఉపాధిహామీ కూలి పెంపు

రూ.245కు పెంచుతూ సర్కారు జీవో
మొక్కల పెంపకానికీ రేట్ల నిర్ధారణ
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ఉపాధిహామీ కూలీల రోజూవారీ కూలీని పెంచుతూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీచేశారు. పెరిగిన కూలీరేట్లు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం కూలీ రూ.235 ఇవ్వగా, ప్రస్తుతం ఆ రేటును రూ.245గా నిర్ధారించారు. తేలికపాటి నేలల్లో మినీ పేర్కొలేషన్ ట్యాంకు, రాక్‌ఫిల్ డ్యాంలు, ఎండిపోయిన బావుల రిచార్జి పనులకు క్యూబిక్ మీటర్‌కు రూ.178.06 ఇవ్వగా ఆ మొత్తాన్ని రూ.196- రూ.218 వరకు పెంచారు. గట్టి నేలల్లో రూ.225-239 వరకు, రాతి నేలల్లో రూ.264 దాకా ఇవ్వనున్నారు. ఇతర పనులకు సంబంధించిన రేట్లను కూడా నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

