భద్రాచలం, అక్టోబర్ 16 : విధుల నుంచి అకారణంగా తొలగించడంతో రోజువారీ వర్కర్ మనోవేదనకు గురై గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో బుధవారం చోటుచేసుకున్నది. భద్రాచలంలోని హరిత హోటల్లో ఇసంపల్లి నర్సింహారావు (40) పదేండ్లుగా రోజువారీగా కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో అతడిని హోటల్ మేనేజర్ విధుల నుంచి తొలగించడంతో తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో నర్సింహారావు కుటుంబ సభ్యులు, బంధువులు, దళిత సంఘాల నాయకులు అతడి మృతదేహాన్ని హోటల్ వద్దకు తీసుకొచ్చి బైఠాయించారు. నర్సింహారావు మృతికి హోటల్ మేనేజరే కారణమని ఆరోపించారు. అతడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.