Cyclone Fengal | ఫెంగల్ ప్రభావంతో భారీ వర్షాలు.. హైదరాబాద్ నుంచి విమానాలు బంద్
Cyclone Fengal | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫాను ఇవాళ పుదుచ్చేరికి దగ్గరలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ ఫెంగల్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చెన్నైలోని విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు.
Cyclone Fengal | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫాను ఇవాళ పుదుచ్చేరికి దగ్గరలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ ఫెంగల్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చెన్నైలోని విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. అలాగే, ఏపీ తిరుపతిలోనూ విమానాల రాకపోకలపై ప్రతికూల ప్రభావం పడింది. దాంతో హైదరాబాద్ నుంచి నడవాల్సిన విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఏడు విమానాలతో పాటు తిరుపతి నుంచి హైదరాబాద్ విమానాలను రద్దు చేశారు. ఇక చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన మూడు విమానాలను రద్దు చేస్తూ ఎయిర్ లైన్స్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
ముంబయి, ఢిల్లీ నుంచి చెన్నైకి బయలుదేరాల్సిన విమానాలను దారి మళ్లించారు. చెన్నై-విశాఖపట్నం-చెన్నై, తిరుపతి-విశాఖపట్నం, తిరుపతి మధ్య సర్వీసులు నిలిచిపోయాయి. ఫెంగల్ తుఫాను ప్రభావంతో రాజధాని చెన్నైలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు పూర్తిగా నీటమునిగాయి. బలమైన ఈదురుగాలులతో కురుస్తున్న భారీ వర్షాలకు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో సాయంత్రం 7 గంటల వరకూ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఇండిగో సహా పలు విమాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. సర్వీసుల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

