హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): సిద్దార్థ్ ప్రైవేట్ ఉద్యోగి. ఎవరో తనను వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. బిట్కాయిన్లతో ఎక్కువ లాభాలు వస్తున్నాయంటూ గ్రూప్‌లోని కొందరు పెట్టే మెసేజ్‌లు చూసి తాను కూడా తొలుత కొద్దిమొత్తంలో పెట్టుబడి పెట్టాడు. లాభాలు రావడంతో లక్షల్లో పెట్టాడు. అతని ఆన్లైన్ అకౌంట్లో డబ్బులు చూపిస్తున్నాయి. కానీ విత్‌డ్రా చేద్దామంటే కాని పరిస్థితి. ఇదీ స్థూలంగా క్రిప్టోకరెన్సీ పేరిట జరుగుతున్న మోసాలు. క్రిప్టోకరెన్సీపై ఉన్న మోజును సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకొంటున్నారు. నకిలీ వెబ్సైట్లు, మొబైల్ యాప్‌లు సృష్టించి వాటి ద్వారా రూ.కోట్లలో డబ్బులు కాజేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ తరహా కేసులు 20కి పైగా నమోదయ్యాయి. బాధితులు దాదాపు రూ.9 కోట్ల వరకు పోగొట్టుకున్నట్టు సమాచారం. కొందరు ఏకంగా రూ.కోటి వరకు పోగొట్టుకొన్నారు. ఇదే తరహాలో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టి రూ.70 లక్షల మోసపోవడంతో సూర్యాపేటకు చెందిన ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వాట్సాప్‌తో వల
సైబర్ నేరగాళ్లు ర్యాండమ్‌గా మొబైల్ నంబర్లను సేకరించి వాటిని క్రిప్టోకరెన్సీ పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్‌ల్లో యాడ్ చేస్తున్నారు. ‘మేం క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు వచ్చాయి. మీ గ్రూప్‌నకు కృతజ్ఞతలు. మాకు వచ్చిన లాభాలు ఇవి..’ అంటూ సైబర్‌నేరగాళ్లు మెసేజ్‌లు, స్క్రీన్షాట్లు పెడుతూ ఇతరులను నమ్మించి, పెట్టుబడులు పెట్టేలా పురిగొల్పుతున్నారని ఒక పోలీస్ అధికారి తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినవారికి లింక్‌లు పంపి, వాటిద్వారా మొబైల్‌యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. పెట్టుబడి పెట్టగానే డబ్బు కొట్టేసి ఫోన్ నంబర్లు మార్చేస్తున్నారు. చాలా కేసుల్లో క్రిప్టోకరెన్సీ పేరిట నడిచే వాట్సాప్ గ్రూప్‌ల అడ్మిన్లు విదేశాల్లోనే ఉంటున్నారు. డబ్బులు సైతం విదేశీ ఖాతాల్లోకి మళ్లిస్తున్నారని, వాటిని తిరిగి రప్పించడం కష్టమని సైబర్‌క్రైం పోలీస్ అధికారి తెలిపారు.
ఈ ఐదు నేరపూరిత వెబ్సైట్లు
క్రిప్టోకరెన్సీలో నేరపూరిత లావాదేవీలను ట్రాక్ చేసే ప్లాట్‌ఫాం అయిన చైనాలిసిస్ నివేదిక ప్రకారం.. 2021లో కొన్ని క్రిప్టో వెబ్సైట్లను గుర్తించారు. వాటిలో coinpayu.com, ad btc.top, hackertyper.net, dualmine. com, coingain.app ఉన్నాయి. ఈ ఐదు వెబ్సైట్లను గత సంవత్సరం 46 లక్షల మంది భారతీయులు సందర్శించినట్టు నివేదిక పేర్కొన్నది.
ఇన్ని దారుల్లో మోసాలు
ఈ జాగ్రత్తలు మరవొద్దు