హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు తమ పంథా మార్చుకుంటున్నారు. ‘ఆర్టీవో ట్రాఫిక్ చలాన్’ పేరుతో అమాయకులకు ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ (ఏపీకే) ఫైళ్లను పంపి దారుణంగా మోసగిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన ఏపీకే ఫైళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) డీజీ శిఖా గోయెల్ శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ‘RTO Traffic Challan.apk’ పేరుతో వచ్చే తప్పుడు లింకులను క్లిక్ చేయవద్దని, బ్యాంకు, ఓటీపీల వివరాలు ఎవరికీ చెప్పొద్దని సూచించారు. ఆ లింకులను క్లిక్ చేసిన వెంటనే ఫోన్ పనిచేయదని, డబ్బులు కోల్పోవాల్సి వస్తుందని, మన ప్రమేయం లేకుండానే ఆ లింకు మన కాంటాక్ట్స్ లిస్టులో ఉన్న వారందరికీ వెళ్తుందని వివరించారు. ఇప్పటికే ఈ ఏపీకే ఫైళ్ల ద్వారా ఎంతోమంది ఆర్థికంగా నష్టపోయారని తెలిపారు. ఇలాంటి నేరాల వల్ల ఎవరైనా మోసపోతే వెంటనే 1930 కాల్ చేయాలని లేదా www. cybercrime.gov.inలో ఫిర్యా దు చేయాలని స్పష్టం చేశారు.డాటా కాదు..