మందమర్రి, సెప్టెంబర్ 10 : టెలిగ్రామ్ యాప్ ద్వారా పార్ట్‌టైమ్ జాబ్ పేరిట సైబర్ కేటుగాళ్లు మోసానికి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్ట్‌టైమ్ జాబ్ ఉన్నట్టు గతనెల 21న మందమర్రికి చెందిన మేరుగు గణేశ్‌కు టెలిగ్రామ్ యాప్ ద్వారా మెసేజ్ వచ్చింది. దీని ప్రకారం గణేశ్ రూ.1,000 పెట్టుబడి పెట్టగా అవతలి వారు రూ.1,300 పంపించారు. రూ.3 వేలు పెడితే రూ.3,900 పంపించారు. వరుసగా ఐదు టాస్క్‌లు పూర్తిచేయాలన్నారు. సైబర్ కేటుగాళ్ల వ్యవహారంతో తాను మోసపోయానని గ్రహించాడు. గణేశ్ మొత్తం రూ.6.15 లక్షలు పోగొట్టుకున్నాడు. కల్యాణ్ కూడా పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో రూ.23 వేలు పోగొట్టుకున్నాడు. బాధితులు ఆదివారం ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.