మార్ఫింగ్ చేస్తే కేసులే.. ట్రోలర్స్‌పై పోలీసుల ఉక్కుపాదం
ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తూ మహిళల మ నోభావాలను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్స్ పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి ఫొటోలు, వీడియోలపై సామా న్య పౌరులు, సామాజిక కార్యకర్తలు ముందుకొచ్చి ఫిర్యాదు చేయవచ్చని హైదరాబాద్ సైబర్‌క్రైమ్స్ డీసీపీ స్నేహా మెహ్రా సూచించారు. మార్ఫింగ్ చేసి ట్రోలింగ్‌కు పాల్పడుతున్న ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.
- 20 కేసులు.. 8 మందికి నోటీసులు
- ప్రముఖులు, ప్రజాప్రతినిధులే వీరి టార్గెట్
- నిందితులు తెలుగు రాష్ర్టాల వారే
- మహిళల ప్రతిష్ఠను దెబ్బతీసేలా పోస్టులు
- సీసీఎస్ సైబర్‌క్రైమ్స్ డీసీపీ స్నేహా మెహ్రా
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగా ణ): ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తూ మహిళల మ నోభావాలను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్స్ పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి ఫొటోలు, వీడియోలపై సామా న్య పౌరులు, సామాజిక కార్యకర్తలు ముందుకొచ్చి ఫిర్యాదు చేయవచ్చని హైదరాబాద్ సైబర్‌క్రైమ్స్ డీసీపీ స్నేహా మెహ్రా సూచించారు. మార్ఫింగ్ చేసి ట్రోలింగ్‌కు పాల్పడుతున్న ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం ఆమె సైబర్ క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. పలువురు ప్రజాప్రతినిధులకు సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు వారి ప్రతిష్ఠను దెబ్బతీసేలా చెలామణిలోకి వచ్చాయని, దీనిపై 20 కేసులు నమోదు చేశామని తెలిపారు. అసభ్యకరమైన రీతిలో ట్రోలింగ్ చేస్తున్న రెండు తెలుగు రాష్ర్టాల్లోని ఎనిమిది మందిని గుర్తించామని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని వారికి నోటీసులు అందించామని డీసీపీ తెలిపారు.
మహిళలను గౌరవించలేని వాళ్లు
సమాజంలో గుర్తింపు ఉన్న మహిళలను, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని, వారి గౌరవానికి భంగం కలిగేలా ట్రోల్ చేస్తున్నారని డీసీపీ స్నేహ ఆవేదన వ్యక్తం చేశారు. కా స్త పేరున్న వారినే గౌరవించలేనివారు సామా న్య మహిళల పట్ల వారి ప్రవర్తన ఎలా ఉం టుందో ఊహించుకోవచ్చని అన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ కవితపై చాలామంది మార్ఫింగ్ ఫొటోలతో ఆమె ప్రతిష్ఠకు భంగం కలిగేలా ట్రోల్స్ చేశారని, దీనిపై పలు ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదయ్యాయని చె ప్పారు. ఇంకా మరికొన్ని కూడా ఇలాంటివే ఫిర్యాదులు అందడంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టి నిందితులను పట్టుకుంటున్నామని తెలిపా రు. ఇలాంటివారిపై సినీ అర్టిస్ట్ కరాటే కల్యా ణి పలు ఫిర్యాదులు చేశారని, ఆమెలా మరిం త మంది ముందుకు రావాలని, అప్పుడే అసభ్యకర పోస్టులు చేసే వారిలో భయం ఉంటుందని ఏసీపీ ప్రసాద్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

