హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని బంజారాహిల్స్లో కార్యాలయంలో ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది సీవీ ఆనంద్కు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ సీపీగా తన అనుభవాలను సీవీ ఆనంద్ ట్విట్టర్(ఎక్స్)లో గుర్తు చేసుకున్నారు. రెండేండ్ల పాటు హైదరాబాద్ సీపీగా పనిచేయడం ఎంతో సంతృప్తిగా ఉందని, ఇప్పుడు గతంలో ఎప్పుడూ పనిచేయని బాధ్యతల్లోకి వచ్చానని పేర్కొన్నారు.
శాంతిభద్రతలను ఎంతో పటిష్టంగా అమలు చేశానని, దీనికి సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత హైదరాబాద్ పరిధిలో 31 కొత్త ఠాణాలు, 12 డివిజన్లు, 3 ట్రాఫిక్ జోన్లు ఏర్పాటు చేశామని వివరించారు.