రామచంద్రాపురం, నవంబర్ 8: సంగారెడ్డికి చెందిన సంతోష్‌కుమార్ జీహెచ్ఎంసీ ఆర్సీపురం డివిజన్లోని అశోక్‌నగర్ ఓలా ఎలక్ట్రికల్ వాహనాల షోరూంలో గత సంవత్సరం ఆగస్టులో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. ఆరు నెలల వరకు బాగానే నడిచినప్పటికీ ఆ తర్వాత మరమ్మతుకు
రావడంతో షోరూంలో ఎవరిని అడిగినా ప ట్టించుకోలేదు. ఎప్పుడు సర్వీసింగ్‌కు ఇచ్చి నా నెలల తరబడి షోరూం చుట్టూ తిప్పించుకోవడంతో పాటు సరిగా స్పందించలేదు. విసుగుచెందిన వాహనదారుడు శుక్రవారం ఓలా షోరూమ్‌కు చెప్పుల దండ వేసి వినూ త్నంగా నిరసన తెలిపాడు. షోరూం మేనేజ్మెంట్ తీరు సరిగా లేదని, ఈ విషయమై కన్జ్యూమర్ కోర్టులో తేల్చుకుంటానన్నాడు.