Minister KTR | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించడంలేదంటూ కేంద్రం ప్రకటన చేసిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇదంతా కేవలం అదానీకి బైలాడీలా ఇను ప గనుల అక్రమ కేటాయింపుల నుంచి దృష్టి మరలించేందుకు చేస్తున్న ప్రయత్నమని ఆరోపించారు.
నిజంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతంపై చిత్తశుద్ధి ఉంటే దానికి వెంటనే డెడికేటెడ్ క్యాప్టివ్ గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న తీరుగా అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌తోపాటు, తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పాతర వేసేలా కేంద్రం కుట్రలు చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు.