CUET PG Exams | హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : సెంట్రల్ యూనివర్సిటీలు, జాతీయ విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ-పీజీ ప్రవేశ పరీక్షలను మార్చి 13 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వెల్లడించింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) పద్ధతిలో మొత్తం 43 షిప్టుల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్స్-2 ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అవకాశం ఇచ్చింది. గురు, శుక్రవారాల్లో (ఈ నెల 27, 28న)తప్పులను సవరించుకోవచ్చని తెలిపింది.