హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) పీజీ -2024 షెడ్యూల్ విడుదలైంది. సీయూఈటీ ప్రవేశ పరీక్షలను 2024 మార్చి 11 నుంచి 28 వరకు నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 24 రాత్రి 11: 50 గంటల వరకు పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
దేశవ్యాప్తంగా 195 సెంట్రల్, స్టేట్, ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లోని పీజీ కోర్సుల్లోని సీట్లను సీయూఈటీ ర్యాంకు ద్వారా భర్తీచేస్తారు. వివరాలకు https://nta.ac.in, https:// pgcuet.samarth.ac.in వెబ్సైట్లను సంప్రదించాలని ఎన్టీఏ వర్గాలు సూచించాయి.