CUET | హైదరాబాద్ : కామన్ యూనివరిటీ ఎంట్రెన్స్ టెస్ట్ ( CUET )-2023 దరఖాస్తుల గడువు ఈ నెల 30 వరకు పొడిగిస్తూ యూజీసీ( UGC ) నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ మేరకు దరఖాస్తులను స్వీకరించడానికి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ( MANU ) నిర్ణయించింది. యూనివర్సిటీలోని అండర్ గ్రాడ్యుయేషన్( Under Graduation )లోని వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.
సీయూఈటీ దరఖాస్తుల గడువు తేదీ ఈ నెల 12 వరకు ఉండే. పలు యూనివర్సిటీల విజ్ఞప్తి మేరకు సీయూఈటీ దరఖాస్తుల గడువు తేదీ పొడిగించినట్లు ఆ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. అలాగే ఈ యూనివర్సిటీలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి మనూ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని ఆ యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.