హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రిటైర్ అయినా విధుల్లో కొనసాగుతున్న అధికారుల వివరాలు ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి అన్ని శాఖల కార్యదర్శులను మంగళవారం ఆదేశించారు. పునర్నియామ కం, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఇలా ఏ శాఖ లో, ఏ విభాగంలో, ఏ హోదాలో పనిచేస్తున్నారు? వారికి ఎంత వేతనం చెల్లిస్తున్నారు? సమగ్ర వివరాలను బుధవారం సాయంత్రానికి అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.