MCHRD | హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో లోక్సభ సచివాలయ అధికారులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని డాక్టర్ ఎంసీహెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్, మాజీ సీఎస్ శాంతికుమారి సోమవారం ప్రారంభించారు.
పార్లమెంటరీ కమిటీల చైర్పర్సన్లు, పార్లమెంటు సభ్యులకు అవసరమైన మద్దతును తెలిపే అంశాలపై శిక్షణ ఇచ్చారు. పార్లమెంట్ సెక్రటేరియట్ లైబ్రేరియన్లు, స్టెనోగ్రాఫర్లు, వ్యక్తిగత సహాయక అధికారుల బాధ్యతలు, విధులను వివరించారు. కార్యక్రమంలో లోక్సభ సెక్రటేరియట్లోని పార్లమెంటరీ పరిశోధన, శిక్షణ సంస్థ డైరెక్టర్ పీకే మల్లిక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్సు డైరెక్టర్ డాక్టర్ కందుకూరి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.