రోడ్డెక్కిన ప్రజాపాలనపై సీఎస్ ఆరా
గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డు పాలైన ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీరియస్ అయ్యారు. జీహెచ్ఎంసీలో అభయహస్తం దరఖాస్తు వివరాల ఆప్‌లోడ్‌లో తీసుకుంటున్న విధానాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిషనర్ రోనాల్డ్‌రోస్‌కు గురువారం ఆదేశాలు జారీ చేశారు.
- సమగ్ర విచారణ చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డు పాలైన ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీరియస్ అయ్యారు. జీహెచ్ఎంసీలో అభయహస్తం దరఖాస్తు వివరాల ఆప్‌లోడ్‌లో తీసుకుంటున్న విధానాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిషనర్ రోనాల్డ్‌రోస్‌కు గురువారం ఆదేశాలు జారీ చేశారు. దాంతో కమిషనర్ హయత్‌నగర్, కుత్బుల్లాపూర్ సర్కిల్లో జరిగిన వ్యవహారంపై దృష్టి సారించారు. ఇప్పటికే హయత్‌నగర్ సర్కిల్ దరఖాస్తుల నిర్లక్ష్యంపై టీం లీడర్ మహేందర్‌పై వేటువేసిన కమిషనర్ రోనాల్డ్‌రోస్ .. కుత్బుల్లాపూర్ సర్కిల్లో టీం లీడర్ భార్గవ నారాయణకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్‌ను కమిషనర్ ఆదేశించారు. హయత్‌నగర్ సర్కిల్లో దరఖాస్తులు బాలానగర్ ఫ్లై ఓవర్ పడిన ఘటనపై పూర్తి విచారణ చేపట్టిన విచారణాధికారి రణజిత్ సదరు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ ద్వారా సీల్డ్ కవర్లో కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. ప్రాజెక్టు ఆఫీసర్ బలరాం, డిప్యూటీ కమిషనర్ రవీందర్ కుమార్ నిర్లక్ష్యం ఉన్నట్టు విచారణ రిపోర్టులో పేర్కొనట్టు తెలిసింది. కుత్బుల్లాపూర్ సర్కిల్ విచారణ రిపోర్టు రావాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

