ఎల్ నినో ప్రభావంపై ప్రజలను చైతన్యం చేయాలి : సీఎస్
ఎల్ నినో ప్రభావంపై ప్రజలను చైతన్యం చేయాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. శుక్రవారం రవీంద్రభారతిలో సమాచారశాఖ అధికారులు, సాంస్కృతిక సారథి కళాకారులకు నిర్వహించిన చైతన్య సదస్సుకు ముఖ్యఅతిథిగా సీఎస్ సంజయ్ జాజు హాజరై మాట్లాడారు.
రవీంద్రభారతి,అక్టోబర్ 23 : ఎల్ నినో ప్రభావంపై ప్రజలను చైతన్యం చేయాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. శుక్రవారం రవీంద్రభారతిలో సమాచారశాఖ అధికారులు, సాంస్కృతిక సారథి కళాకారులకు నిర్వహించిన చైతన్య సదస్సుకు ముఖ్యఅతిథిగా సీఎస్ సంజయ్ జాజు హాజరై మాట్లాడారు. ఎల్ నినోపై సమాచార, సాంస్కృతిక శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సాంస్కృతిక సారథి కళాకారులు, జానపద కళాకారులు క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యం చేయాలన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, సమాచార కమిషనర్ ముకుందరెడ్డి, డీఎస్ జగన్, కే వెంకటరమణ, శ్రీనివాస్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడం లక్ష్యంగా సంస్కరణలు అమలు చేస్తున్నట్టు సీఎస్ సంజయ్ జాజు చెప్పారు. తొలి దశలో గుర్తించిన 23 ప్రాధాన్య రంగాల్లో సంసరణలు అమలు చేసి 100 శాతం లక్ష్యాన్ని సాధించినట్టు తెలిపారు. కేంద్ర కార్యదర్శి సుకృతి లిఖితో కలిసి శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎస్ సంజయ్ జాజు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

