వినాయక్ నగర్, సెప్టెంబర్ 24: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి రూ.8.5 కోట్లతో ఉడాయించి ఆరు నెలలుగా పరారీలో ఉన్న నిందితులను నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని ఆస్మి కాలనీకి చెందిన మొహమ్మద్ మెహిజ్ఖాన్, మహమ్మదీయ కాలనీకి చెందిన సయ్యద్ అమీద్హుస్సేన్ కలిసి 2022లో స్పెయిమ్ ఎవర్గ్రీన్ కంపెనీ పేరుతో మల్టీలెవల్ మార్కెటింగ్ దందా ప్రారంభించారు. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించి రూ.8.5 కోట్లు దండుకుని అదృశ్యమయ్యారు. ఇందల్వాయికి చెందిన ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో నిందితుల జాడ కనిపెట్టి అరెస్టు చేశారు.