Vinay Bhasker | వరంగల్ : ప్రొఫెసర్ జయశంకర్ సర్ జీవితం తెలంగాణకే అంకితం చేశారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని బుధవారం రోజున బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా బతికిన మహనీయుడు జయశంకర్ సర్ అని కొనియాడారు. తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు, మలిదశ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన సిద్ధాంతకర్త జయశంకర్ సర్. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది అని నమ్మి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు జయశంకర్ సర్. తెలంగాణ సమాజాన్ని ఉద్యమ బాటలో నడిపిన గొప్ప వ్యక్తి జయశంకర్ సర్ అని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్లు చెన్నం మధు, సంకు నర్సింగ రావు, నాయకులు జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్, నాయీముద్దీన్, జానకిరాములు, వినీల్ రావు, దేవమ్మ, తస్లీమా, ఇస్మాయిల్, ఖలీల్, రమేష్, మహమూద్, విజయ్ రెడ్డి, రామ్ చందర్, శేఖర్, రాజేందర్, శరత్, రాకేష్ యాదవ్, రాజ్ కుమార్, మనోజ్, శ్రీకాంత్, రాజు, శ్యామ్ రెడ్డి, ప్రభాకర్, అనిల్, సలాం అబ్దుల్, తదితరులు పాల్గొన్నారు.