హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కొండపై ఉన్న 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి అతిథి గెస్ట్‌హౌజ్ వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. శనివారం 73,313 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 39,344 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు సమకూరినట్టు అధికారులు తెలిపారు. అదే విధంగా తిరుమలలో ఈ నెల 15 నుంచి 17 వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 14న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.