టేకుమట్ల, ఏప్రిల్ 6 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లిలో చలివాగు ఒడ్డున వేసిన వరి పొలాలు ఎండిపోతున్నాయి. చలివాగు పూర్తిగా వట్టిపోవడంతో సాగు నీరందక చేతికొచ్చే దశలో మాడిపోతున్నాయి.
ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కకపోవడంతో పొలాలను పశువుల మేతకు వదులుతున్నారు. ఒక్క కుందనపల్లిలోనే 80 ఎకరాల వరి ఎండిపోయినట్టు అధికారులు తెలిపారు. మరికొందరు రైతులు అప్పు చేసి చలివాగులో జేసీబీలతో లోతైన బావులు తవ్వించుకొని పంటలకు నీరు పెట్టుకొంటున్నారు.