హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తేతెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు కోసం డబ్బులు డిమాండ్ చేస్తే 24 గంటల్లో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఇండ్ల కోసం ఇచ్చిన నిధులను పాతబాకీ కింద జమ చేసే బ్యాంకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇండ్ల బిల్లుల కోసం లంచాలు అడిగితే ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్‌ను (18005995991) ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తమ్మిడిహట్టి’ అంచనాలు రూపొందించాలె: ఉత్తమ్
హైదరాబాద్, సెప్టెంబర్19 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి రూ.35 వేల కోట్లతో ప్రభుత్వం ఎలాంటి అంచనాలను రూపొందించలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అంచనాలపై వస్తున్న వార్తల్లో నిజం లేదని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ్మడిహట్టి బరాజ్, చేవేళ్ల-ప్రాణాహిత ప్రాజెక్టు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.35 వేల కోట్లతో అంచనాలు రూపొందించామనేది మాత్రం అబద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వం అంచనాల ప్రక్రియ మొదలుపెట్టలేదని, అంచనాలు రూపొందిస్తే అధికారికంగా ప్రకటిస్తుందని పేర్కొన్నారు.