కాచిగూడ, ఫిబ్రవరి 5: ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమీలేయర్ అమలు చేయాలని తెలంగాణ మాదిగ మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం బర్కత్‌పురలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు, ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం సూచించిన విధంగా క్రిమిలేయర్‌ను అమలు చేయాలని సూచించారు. క్రిమిలేయర్‌పై తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేని పక్షంలో ఈ నెల 18న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు హెచ్చరించారు.