హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ఏపీలోని అరకు లోక్‌సభ స్థానానికి సీపీఎం పోటీ చేస్తుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రా ఘవులు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఏపీ ఎ ప్పుడూ చూడనంత అపవిత్ర పొత్తుగా అభివర్ణించారు.
కేరళ సీఎం కూతురుపై కాకతాళీయంగా దొరికిన దానిని వాడుకుని చిక్కుముడి వేసి అనుమానాలు సృ ష్టించడానికే ఈడీ దాడులు చేస్తుందని మండిపడ్డారు. సీపీఎంపై అవినీతి ము ద్ర వేయాలని చూస్తున్నారని అన్నారు.