వనపర్తి, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): మూసీ నది ప్రక్షాళన పేరిట పేదలకు నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సీపీఎం నాయకురాలిగా సేవలందించిన ఎన్ఎస్ లక్ష్మీదేవమ్మ సంస్మరణ సభను ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. నదిని కాలుష్యం చేస్తున్న ఫార్మా కంపెనీలను ముట్టుకునేందుకు ప్రభుత్వానికి ధైర్యం లేక.. 15 వేల పేదల ఇండ్లను తొలగించాలని రేవంత్రెడ్డి సర్కార్ చూస్తున్నదని విమర్శించారు. మూసీ ప్రక్షాళన, కాలుష్య నివారణకు తాము వ్యతిరేకం కాదని, ముందుగా పేదలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.