హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తేతెలంగాణ) : వికారాబాద్ జిల్లా దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణంతో పర్యావరణానికి పెనుముప్పు కలుగనున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశా రు. అటవీ ప్రాంతంలోని 3 వేల ఎకరాల్లో రాడార్ స్టేషన్ నిర్మిస్తే.. లక్షలాది వృక్షాలు, వన్యప్రాణులకు నష్టం వాటిల్లే ప్రమా దం పొంచిఉందని ఆవేదన వ్యక్తంచేశారు. వేరేచోట నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.