‘తెలుగు స్ర్కైబ్’పై విచారణ ఆపాలి : సీపీజే
సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తున్న ‘తెలుగు స్ర్కైబ్'పై తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం తక్షణమే విచారణ ఆపాలని ‘ది కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్(సీపీజే)’ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తున్న ‘తెలుగు స్ర్కైబ్’పై తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం తక్షణమే విచారణ ఆపాలని ‘ది కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్(సీపీజే)’ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ‘తెలుగు స్ర్కైబ్’ ఖాతా వివరాలివ్వాలని అధికారులు కోరినట్టు తెలిపింది. ఉ.పాను ప్ర యోగించి రెచ్చగొట్టేలా కంటెంట్ ఉన్నదని ఆరోపించడం సరికాదని పేర్కొన్న ది. ఇది ఉ.పా చట్టాన్ని దుర్వినియోగపర్చడమే అవుతుందని సీపీజే అభిప్రాయపడింది. ఇది పత్రికా స్వేచ్ఛపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రభుత్వ విధానాలను ఎండగట్ట్టే డిజిటల్ వార్తలను అణచివేసేందుకు కఠినమైన చట్టాలను వాడటాన్ని ఆపాలని డిమాండ్ చే సింది. రెండున్నరేండ్లల్లో తెలుగు స్ర్కైబ్ పై 70కిపైగా కేసులు నమోదు చేయడ మేమిటని ప్రశ్నించింది. ఇలాంటి చర్య లు మానుకోవాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

