హిమాయత్‌నగర్, ఏప్రిల్ 10: మతోన్మాద బీజేపీ అనేక రాష్ర్టాల్లో అక్రమంగా అధికారాన్ని చేపట్టిందని, ఆ శక్తుల ఆగడాలను అరికట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. టెన్త్ పేపర్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం హిమాయత్‌నగర్‌లో నిరసన దీక్ష చేపట్టారు.
దీక్షలో కూనంనేని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను విద్యార్థులు ఉద్యమాలతో అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు బెనర్జీ, రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి, నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలీఉల్లాఖాద్రీ, పలు విద్యార్థి సంఘాల నాయకులు నాగరాజు, రామకృష్ణ, విజయ్, శ్రీకాంత్, మహేశ్, మారుపాక అనిల్, నాగజ్యోతి పాల్గొన్నారు.