హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సినీప్రముఖులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తే బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహించినట్టేనని అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ప్రజలపై భారం మోపకుండా చూడాలని కోరారు.
సందేశాత్మక, వినోద్మాత్మక చిత్రాలకు ప్రోత్సాహకాలివ్వాలని, నేరాలు, అశ్లీలతతో కూడిన సినిమాలకు బెనిఫిట్ ఎందుకు చేయాలని ప్రశ్నించారు. సినిమా హీరోలు రోడ్ షోలు చేయడం ఎందుకని నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి రూ.2 కోట్లు కాదు ఐదు కోట్లిచ్చినా పోయిన ప్రాణం తిరిగిరాదని చెప్పారు.
పూర్తి పరిష్కారానికి ‘సోఫా చేరాల్సిందే’