హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ ఆయన పనితీరుపై లోతైన ఆత్మపరిశీలన చే సుకోవాలని సీపీఐ జాతీయ కార్యద ర్శి కే నారాయణ అన్నారు. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ గ్రాఫ్ పడిపోవడం చూశామని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ ఇమేజ్ పెరుగుతుంటే పార్లమెంట్ సీట్ల సంఖ్య 303 నుంచి 242కు ఎందుకు పడిపోయిందని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో నారాయణ ప్రశ్నించారు.