హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర శూన్యమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి అమరులను అవమానించేలా ప్రసంగించారని మండిపడ్డారు.
ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 1925లో ఆర్ఎస్ఎస్, సీపీఐ ఆవిర్భవించాయని, దేశ విముక్తి కోసం సీపీఐ అలుపెరగని పోరాటం చేసిందని, ఆర్ఎస్ఎస్ చేసిందేమీ లేదని దెప్పిపొడిచారు.