కేసీఆర్ బీహార్ పర్యటన భేష్
- బీజేపీ వ్యతిరేకశక్తులను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేయాలి
- ఇతర రాష్ర్టాల సీఎంలను కలవాలి
- అదానీకి దోచిపెడుతున్న బీజేపీ
- సీపీఐ జాతీయ నేత నారాయణ
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను కలవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ కోరారు. బీహార్, ఢిల్లీ, జార్ఖండ్‌తోపాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను సైతం కలవాలని సూచించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లి నితీశ్‌కుమార్‌ను కలవడం కీలక పరిణామమని పేర్కొన్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఆప్ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను బీజేపీ వేధిస్తున్నదని, ఎన్నికల కమిషన్, గవర్నర్‌ను అడ్డం పెట్టుకొని జార్ఖండ్ ముఖ్యమంత్రిపై అనర్హత వేటుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు ఆదివాసీని రాష్ట్రపతిని చేశామని చెప్పుకొంటూ మరోవైపు ఆదివాసీ సీఎం గొంతు కోస్తారా? అని నిలదీశారు.
ఎన్నికల కమిషన్ రాజ్యాంగ స్వయంప్రతిపత్తిని మరిచి ప్రధాని మోదీ చేతిలో పావులాగా మారడం దుర్మార్గమని మండిపడ్డారు. బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం అడ్డదారులు తొకుతున్నదని దుయ్యబట్టారు. మొన్నటివరకు కేసీఆర్ జోలికిరాని కేంద్రం ఆయన నిలదీస్తుండటంతో సీబీఐ, ఈడీలతో దాడికి ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆయన తాత సీనియర్ ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ ఇలాంటి వారిని దగ్గరకు కూడా రానిచ్చే వారు కాదని చెప్పారు. కేంద్రం దేశాన్ని దోచిపెడుతుండటం వల్లనే అదానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో మూడో స్థానం పొందారని విమర్శించారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అదానీ ఒక స్మగ్లర్ అని, ఇప్పుడు కూడా ఆయన ముంద్రా పోర్టు నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణపట్నం పోర్టు, బొంబాయి ఎయిర్‌పోర్టును బలవంతంగా ఇతరుల నుంచి లాకొని అదానీకి కట్టబెట్టారని మండిపడ్డారు.
రాష్ట్ర మహాసభలకు ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 4 నుంచి 7 వరకు శంషాబాద్‌లో నిర్వహించనున్న సీపీఐ రాష్ట్ర మూడో మహాసభల నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగనీయబోమని, ఆ పార్టీ ఓటమే లక్ష్యంగా మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

