హైదరాబాద్, జనవరి 3 : చెప్పులపై జీఎస్టీ పెంపునకు నిరసనగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం కూడలి వద్ద సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ బూట్లు పాలిష్చేసి నిరసన తెలిపారు. సామాన్యులు వాడే చెప్పులపై జీఎస్టీ తగ్గించకుంటే బీజేపీ నేతలకు చెప్పులతో స్వాగతం పలుకుతామని ఆయన హెచ్చరించారు.