రోడ్డు ప్రమాదంలో 13 గోవుల మృతి
రోడ్డు ప్రమాదంలో 13 గోవులు మృతి చెందాయి. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి హైదరాబాద్‌లోని కబేలాల కోసం డీసీఎంలో 51 పశువులను తరలిస్తున్నారు.
- పశువుల అక్రమ రవాణా వాహనం బోల్తా
- 25 ఆవులను గోశాలకు తరలించిన పోలీసులు
పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 28: రోడ్డు ప్రమాదంలో 13 గోవులు మృతి చెందాయి. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి హైదరాబాద్‌లోని కబేలాల కోసం డీసీఎంలో 51 పశువులను తరలిస్తున్నారు.
పాలకుర్తి మండలం వావిలాల మూల మలుపు వద్దకు రాగానే డ్రైవర్ నిర్లక్ష్యంతో డీసీఎం అదుపు తప్పి బోల్తాపడింది. అందులో ఉన్న 13 గోవులు అక్కడికక్కడే మృతి చెం దగా.. మరో 13 గాయపడ్డాయి. పశు వైద్యాధికారి అశోక్‌రెడ్డి వాటికి వైద్య పరీక్షలు చేశారు.
మిగిలిన 25 ఆవులను పోలీసులు గోశాలకు తరలించారు. డీసీఎం డ్రైవర్ పరారైనట్టు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. డ్రైవర్‌పై కేసు న మోదు చేసి వాహనాన్ని సీజ్ చేశామని సీఐ వివరించారు. ఘటనా స్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య పరిశీలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

