నాంపల్లి కోర్టులు, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): మహబుబ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌పై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు నాంపల్లిలోని 1వ అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి జడ్జి రమాకాంత్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఎన్నికల అఫిడవిట్‌ను ట్యాంపర్ చేశారంటూ శ్రీనివాస్‌గౌడ్‌పై నమోదైన కేసులో పిటిషనర్ రాఘవేంద్రరాజు దాఖలు చేసిన ప్రొటెస్టు పిటిషన్‌పై సుదీర్ఘ వాదనల అనంతరం జడ్జి స్పందిస్తూ.. ఈ కేసు విచారణను కొనసాగించే అధికారం ప్రత్యేక కోర్టుకు లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తదుపరి కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించారు.