హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం కావాలని ప్రజలు కోరుతున్నారని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పేర్కొన్నా రు. అనేక సంక్షేమ పథకాలతో ఎనిమిదేండ్లలో తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు దివాళాకోరు విధానాలు ఎండగట్టే సత్తా సీఎం కేసీఆర్కు ఉన్నదని గ్రహించినందునే అనేక రాష్ర్టాల ప్రజలు, పలు రాజకీయ పార్టీలు కేసీఆర్కు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. కొవిడ్ సమయంలో వలస కార్మికులను ఆదుకొని, వారిని స్వస్థలాలకు పంపి కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ఓ వైపు అభివృద్ధి, మరోవైపు పేదల సంక్షేమం కోసం పరితపించే ప్రజానేత కేసీఆర్ నాయకత్వం కోసం దేశ ప్రజలంతా ఆశతో ఎదురుచూస్తున్నారని తెలిపారు.